వెనక్కి తగ్గిన ఆర్టీసీ జేఏసీ – ఆ డిమాండ్ తొలగింపు

Thursday, November 14th, 2019, 07:46:02 PM IST

గత కొద్దీ రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె ప్రస్తుతానికి ఉదృతంగా మారిన సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ కార్మికుల తాలూక డిమాండ్లను పరిష్కరించడానికి తెలంగాణ పభుత్వం ఎట్టకేలకు అంగీకరించడం లేదని ఆర్టీసీ కార్మికులు తమ సమ్మె ని ఇంకా తీవ్రతరంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తూ ముందుకు పోతున్నారు. అయితే ఇలా అయితే కుదరదని ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఒక మెట్టు దిగి వెనక్కి తగ్గారని సమాచారం. అయితే వీరి డిమాండ్లలో ప్రధానమైన ఆర్టీసీ విలీనాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వినర్ అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు.

ఇకపోతే ఈ ఒక్క డిమాండ్ ని పక్కన పెట్టి కనీసం మిగిలిన డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ నాయకుడు కోరారు. లేకపోతే తమ సమ్మె ని ఎదావిదిగా కొనసాగిస్తామని, అసలే వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. కాగా రాష్ట్రంలో పలు పార్టీలు, ప్రజా సంఘాల నేతలతో చర్చలు జరిపిన అనంతరం తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని, అంతేకాకుండా శుక్రవారం నుండి పలు డిపోల నుంచి గ్రామాలకు బైక్ ర్యాలీ నిర్వహిస్తామని, తమ సమ్మెని ఇంకా ఉదృతంగా మారుస్తామని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.