హాట్ టాపిక్: హైకోర్టు ఇచ్చిన టైం దగ్గరపడుతుండటం తో చర్చల పై ఉత్కంఠ

Saturday, October 19th, 2019, 08:28:46 AM IST

తెలంగాణ రహ్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికి చర్చల మీద స్పందించడం లేదు. గత రెండు వారాలుగా ఆర్టీసీ సమ్మె జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. తెరాస వైఖరి పట్ల ప్రజలు, సమ్మె కార్మికులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి సవాలుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర బంద్ జరుగుతుంది. ప్రభుత్వ వైఖరి పై సీరియస్ అయిన హైకోర్టు ఎండీ నియామకం పై ప్రశ్నించింది. అంతే కాకుండా ఆర్టీసీ చేస్తున్న సమ్మెకు గల కారణాలు, వారి డిమాండ్లు సగానికి పైగా న్యాయమైనవే. దీని వలన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కి ఎలాంటి భారం కాదని స్పష్టం చేసింది.

హైకోర్టు సీరియస్ అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి ఇంకా పెదవి విప్పడం లేదు. రాష్ట్ర ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు ని తెలుపుతున్నాయి. బంద్ రాష్ట్రం లో అన్ని చోట్ల ప్రశాంతంగా జరుగుతున్నప్పటికీ చర్చల పై మాత్రం ఇంకా ఉత్కంఠను రేపుతోంది. కేసీఆర్ నిర్ణయం తో రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు బంద్ ని విరమించే అవకాశం వుంది. మరి కేసీఆర్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో వేచి చూడాలి.