బిగ్ బ్రేకింగ్: ఆర్టీసీ జేఏసీ మరో సంచలనాత్మక నిర్ణయం.

Sunday, October 20th, 2019, 03:04:54 PM IST

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె 16 వ రోజుకు చేరింది. పొలిటికల్ జేఏసీ తో భేటీ అయినా ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణ పై చర్చలు జరిపారు. పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు తెలిసింది. అయితే తెలంగాణ గవర్నర్ ఇప్పటివరకు ఆర్టీసీ సమ్మె విషయం లో కలగచేసుకోక పోవడం తో ఆర్టీసీ జేఏసీ మాట్లాడనుంది. అశ్వథామరెడ్డి అద్వర్యం లో సాయంత్రం గవర్నర్ మీ కలిసి జోక్యం చేసుకోవాల్సిందిగా కోరనున్నారు. ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవడమే తమ లక్ష్యమని అశ్వథామరెడ్డి అన్నారు. కార్మికులను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేసారు. విజయం సాధించే వరకు అధైర్యపడొద్దని అన్నారు. కార్మికుల ప్రయోజనం కోసమే ఈ సమ్మె అని తెలిపారు.

పొలిటికల్ జేఏసీ తో చర్చలు జరిపిన అనంతరం ఆర్టీసీ జేఏసీ తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. 21 న కార్మికుల కుటుంబ సభ్యులతో డిపోల ఎదుట బైఠాయించనున్నారు. 22 న తాత్కాలిక డ్రైవర్లు మరియు కండక్టర్లని కలిసి మా పొట్ట కొట్టొద్దు అంటూ విజ్ఞప్తి చేయనున్నారు. ప్రజా ప్రతినిధులను సమ్మెలో భాగం చేయడం, 24 న మహిళా కండక్టర్ల దీక్ష, 25 న హైవేలు, రహదారుల పై రాస్తారోకో నిర్వహించడం, 26 న ఆర్టీసీ కార్మికుల పిల్లలతో దీక్ష, 27 న జీతాలు చెల్లించనందున నిరసన, 28 న హైకోర్టు విచారణ సందర్భంగా విరామం, 30 న సకల జనుల సమరభేరి మోగిస్తామని ప్రకటించింది. ఇప్పటికైనా కేసీఆర్ తీరు మారకపోతే ఇక ఉద్యమం తప్పదు.