దర్శనాల సంఖ్య పెంచే ఆలోచన లేదు – వై వి సుబ్బారెడ్డి!

Friday, July 31st, 2020, 12:12:43 AM IST

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే లాక్ డౌన్ అమలు అయినప్పటికీ పలు చోట్ల కరోనా ఉదృతి తగ్గలేదు. అయితే తిరుమల తిరుపతి లో సైతం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే తాజాగా తిరుమల శ్రీవారి దర్శనం గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. దర్శనాల సంఖ్య ము ఇపుడు అపుడే పెంచే యోచన లేదు అని తేల్చి చెప్పారు.

కరోనా వైరస్ మహమ్మారి భారిన పడిన అర్చకులు, సిబ్బంది కోలుకున్నారు అని మీడియా సమావేశం లో తెలిపారు. అయితే ఆన్లైన్ ద్వారా శ్రీవారి కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన టికెట్ లను అందుబాటులోకి తెస్తామని అన్నారు. అంతేకాక వారి పేరు, గోత్ర నామాలతో కల్యాణోత్సవం నిర్వహిస్తాం అని అన్నారు. అయితే వారికి తపాలా ద్వారా అక్షింతలు, వస్త్రాలను పంపుతాం అని వివరించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యం లో ఈ నిర్ణయం తీసుకున్నాం అని అన్నారు.