తిరుమల ఆలయం తెరవడానికి సిద్దం అంటూ సీఎం జగన్ కి టీటీడీ చైర్మన్ లేఖ

Wednesday, May 27th, 2020, 12:01:42 PM IST


కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశంలో లాక్ డౌన్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ కారణం గా దేశంలో ఎక్కడా కూడా ఆలయాలు, మసీదులు, చర్చు లు ఏవి కూడా తెరవ బడి లేదు. అయితే లాక్ డౌన్ ఈ నెలాఖరుతో పూర్తి అవుతున్నప్పతికి ఆలయం ప్రస్తుతం తెరిచేందుకు సిద్దం అని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ చైర్మన్ ఒక లేఖ రాశారు. అందులో తిరుమల ఆలయం తెరవడానికి సంబంధించిన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.అయితే తిరుమల ప్రాంతం మొత్తం శానిటైజ్ చేయబడి ఉంది అని లేఖలో పేర్కొన్నారు. అంతేకాక భౌతిక దూరం పాటించేందుకు కూడా గుర్తులు పెట్టాం అని వ్యాఖ్యానించారు.అయితే మొదటి రోజు 10 వేల మంది భక్తులకు దర్శనం కొరకు ట్రైల్ కి అనుమతి ఇవ్వాలని కోరారు.

అయితే తిరుమల ఆలయం రోజుకి 14 గంటలు తెరిచి ఉండేలా ప్లాన్ చేసింది. అంతేకాక గంటకి 500 మందికి దర్శనం ఉండేలా చర్యలు తీసుకుంది.అన్ని ప్రాంతాల్లో దర్శనాలకి సంబంధించి కౌంటర్లు మూసివేయడం జరిగింది అని, కేవలం అత్యాధునిక ఆన్లైన్ బుకింగ్ మాత్రం అందుబాటులో ఉంది అని అన్నారు. అంతేకాక రెడ్ జోన్, కంటెన్మేంట్, ఎక్కువగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయిన ప్రాంతాల ప్రజలకు దర్శనం లేదు అని అన్నారు.అంతేకాక అన్ని రకాల చర్యలను తీసుకుంటుంది. కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం అని,ఆలయాన్ని తెరిచేందుకు దశల వారీగా అనుమతి ఇవ్వాలని లేఖలో కోరడం జరిగింది.