చిన్నమ్మ కి ‘ మంగళవారం ‘ సెంటిమెంట్ దెబ్బ ?

Wednesday, February 15th, 2017, 12:11:45 PM IST


సీఎం కుర్చీ లో కూర్చోవడమే పరమావధి గా పెట్టుకున్న శశికళ కి మొత్తం డోర్ లు అన్నీ మూసుకుని పోయాయి. అక్రమాస్తుల కేసులో ఆమె దోషిగా నిర్ధారణ అవ్వడం .. నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ కోర్టు నిర్ణయం రావడం తో ఎన్నికల్లో పోటీ కూడా చేసే ఛాన్స్ లేకుండా పోయింది ఆమెకి. పదేళ్ళ పాటు రాజకీయాలలో నిషేధం పడింది ఆమె మీద. జైలు శిక్ష గనక అనుభవిస్తే మూడున్నరేళ్లు.. తర్వాతి ఆరున్నర సంవత్సరాలు ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే వీలు లభించదు.అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన చిన్నమ్మ.. సీఎం కుర్చీలో కూర్చోవటానికి వీలుగా గత మంగళవారం ముహుర్తంగా పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లే.. అమ్మ స్మారకం ఉన్న మెరీనా బీచ్ కు దగ్గర్లోని మద్రాస్ యూనివర్సిటీలోని సెంటినరీ హాల్ ను తన సీఎం ప్రమాణస్వీకారోత్సవానికి వేదికగా ఫిక్స్ చేసుకున్నారు. అందుకు తగ్గట్లే పనుల్ని ప్రారంభించారు. అయితే.. ప్రమాణస్వీకారం చేయించాల్సిన గవర్నర్ నుంచి సానుకూల స్పందన రాకపోవటంతో.. ప్రమాణస్వీకారోత్సవ పనుల్ని వాయిదా వేశారు.