భేటీ అయిన తుమ్మల మరియు మచ్చ…

Wednesday, January 9th, 2019, 02:50:50 AM IST

తాజాగా రాజకీయాలు రోజుకో పరిణామాన్ని చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వర్ రావు గారు త్వరలోనే తెరాస తీర్తం పుచ్చుకోబోతున్నారనే ప్రచారం నేడు ఊపందుకుంది. దానికి కారణం నేడు మచ్చ నాగేశ్వర్ రావు, తెరాస నేత అయిన తుమ్మల నాగేశ్వర్ రావు తో కలిసి భేటీ అయ్యారు. వీరి కలయికతో మచ్చ నాగేశ్వర్ రావు తెరాస లో చేరడం ఖాయం గానే కనిపిస్తుంది.

తుమ్మలతో భేటీ విషయాన్ని నాగేశ్వరరావు తెలిపారు. తాను తుమ్మలను పరామర్శించడానికి వెళ్లానని చెప్పుకొచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి విజయం సాధించిన మచ్చా నాగేశ్వరరావు… ఇవాళ సత్తుపల్లి మండలం పాకలగూడెంలోని తుమ్మల గెస్ట్ హౌస్ లో ఆయనతో భేటీ అయ్యారు. వీరి తాజా కలయిక చూస్తుంటే నిజంగానే మచ్చ నాగేశ్వర్ రావు తెరాస లో కలిసేలానే ఉన్నాడు.