టివి ప్రభాకర్ దర్శత్వంలో .. యువ హీరో సినిమా ?

Tuesday, February 14th, 2017, 04:56:56 PM IST


అప్పట్లో టివి యాక్టర్ ప్రభాకర్ కు ఉన్న క్రేజ్ మాములుగా లేదు. ఓక దశలో బుల్లితెర మెగాస్టార్ గా ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాకర్ ..ఈ టివి, సుమన్ ల వ్యవహారంతో కొన్నాళ్ళు మీడియా కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం అడపా దడపా టివి షోలలో కనిపిస్తున్న ప్రభాకర్ ఇప్పుడు మెగాఫోన్ పట్టేందుకు సిద్ధం అయ్యాడు. పలు టివి సీరియల్స్ ను రూపొందించిన ప్రభాకర్ దర్శకత్వం వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అయన దర్శకత్వంలో హీరోగా నటించేది ఎవరో తెలుసా .. హీరో ఆది. ఇటీవలే ”చుట్టాలబ్బాయి” సినిమాలో నటించిన ఆది ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ”శమంతకమణి” సినిమాలో ఓ హీరోగా నటిస్తున్నాడు. లేటెస్ట్ గా ప్రభాకర్ చెప్పిన కథ బాగా నచ్చడంతో ఈ సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. నిజానికి అల్లు శిరీష్ తో ఈ సినిమా ప్లాన్ చేసాడు ప్రభాకర్ కానీ అది కుదరక పోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆది దగ్గరకి వెళ్ళింది. అన్నట్టు ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2, అండ్ యువి క్రియేషన్స్ కలిసి నిర్మిస్తాయట !! సో మంచి క్రేజీ సినిమాతో ప్రభాకర్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడన్నమాట !! మరి దర్శకుడిగా ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటాడో చూడాలి ?