షాకింగ్ : మ‌ల్లూ న‌టి త‌ర‌హాలో మ‌రో లైంగిక దాడి

Thursday, March 15th, 2018, 11:07:19 PM IST

మాలీవుడ్ క‌థానాయిక దారి మ‌ల్లింపు, లైంగిక దాడి వ్య‌వ‌హారం గ‌త ఏడాది సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ త‌ర‌హా వేదింపులు కేవ‌లం క‌థానాయిక‌ల‌కే కాదు, క్యాబ్‌లు ఎక్కే ఎంద‌రో మ‌హిళ‌లకు త‌ప్ప‌డం లేదు. అయితే తాజాగా మాలీవుడ్ నాయిక‌కు జ‌రిగిన‌ట్టే ఓ టీవీ న‌టికి జ‌ర‌గ‌డం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైంది. స‌ద‌రు క్యాబ్ డ్రైవ‌ర్ దారి మ‌ళ్లించి అఘాయిత్యానికి పాల్ప‌డేందుకు సిద్ధ‌మ‌య్యాడు. అస‌లింత‌కీ ఎవ‌రా న‌టి? ఎక్క‌డ జ‌రిగింది? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

క్యాబ్ డ్రైవ‌ర్ ట్రాప్ వేసిన‌ స‌ద‌రు న‌టి ఫేమ‌స్ టీవీ న‌టి ఉపాస‌న సింగ్‌. క‌పిల్ శ‌ర్మ కామెడీ నైట్స్ ద్వారా షోలో పింకీ బువా పేరుతో అభిమానుల‌కు సుప‌రిచితం. అయితే స‌ద‌రు న‌టి షూటింగ్ ముగించుకుని తాను బ‌స చేసిన ఛండీఘ‌ర్‌ హోట‌ల్‌కి క్యాబ్‌లో బ‌య‌ల్దేరింది. అయితే మార్గం మ‌ధ్య‌లో క్యాబ్ డ్రైవ‌ర్ కొత్త గేమ్ ప్లే చేశాడు. తాను ఎక్కిన కార్ ఎంత‌కీ ల‌క్ష్యాన్ని చేరుకోక‌పోవ‌డంతో సందేహించిన స‌ద‌రు న‌టి వెంట‌నే అలెర్ట‌య్యింది. ఎక్క‌డికి తీసుకెళుతున్నావ్‌? అంటూ డ్రైవ‌ర్‌ని సీరియ‌స్‌గానే ప్ర‌శ్నించింది. అయితే అట్నుంచి స‌మాధానం మాత్రం స‌రిగా రాలేదు. స‌రిక‌దా .. దారి త‌ప్పాం అంటూ బొంకేందుకు చూశాడు. కేవ‌లం 45 నిమిషాల్లో ముగించాల్సిన ప్ర‌యాణం ఎవ‌రూ లేని నిర్జ‌న ప్ర‌దేశానికి షిఫ్ట‌యి, హారిబుల్‌గా మార‌డంతో వెంట‌నే ఉపాస‌న పోలీసుల‌కు ఫోన్ చేసింది. దాంతో రిస్క్ ఆప‌రేష‌న్‌లోకి దిగిన పోలీస్ క్యాబ్‌ని వెంబ‌డించి స‌ద‌రు న‌టిని ర‌క్షించారు. డ్రైవ‌ర్‌ని ప‌దే ప‌దే ప్ర‌శ్నించిన పోలీసుల‌కు అత‌డు స‌రైన స‌మాధానం ఇవ్వ‌లేదు. చివ‌రికి తాను దురాలోచ‌నతో ఉన్న విష‌యాన్ని పోలీసుల‌కు చెప్పాడు. ఆస‌క్తిక‌రంగా ఈ కేసులో స‌ద‌రు క్యాబ్ డ్రైవ‌ర్‌ని అరెస్ట్ చేస్తార‌ని భావిస్తే, స‌ద‌రు న‌టి క్ష‌మించి వ‌దిలేయ‌డం విశేషం. క్ష‌మాప‌ణ లేఖ ఒక‌టి రాయించుకుని స‌ద‌రు డ్రైవ‌ర్‌ని పోలీసులు విడిచిపెట్టారు.