లైంగిక వేదింపుల్లో మ‌రో మ‌హా జాదూ!!

Friday, December 1st, 2017, 10:19:29 AM IST

హార్వే వీన్‌స్టీన్‌.. కెవిన్ స్పేసీ.. సిల్వ‌స్ట‌ర్ స్టాలోన్‌.. చార్లీ రోజ్‌.. ఈ జాబితాలో మ‌రో కొత్త పేరు చేరింది. వీళ్లంతా కొలీగ్స్‌ని లైంగికంగా వేదించిన కిరాత‌క జాబితాలో చేరిన ప్ర‌ముఖులు. తాజాగా.. ప్ర‌ఖ్యాత ఎన్‌బిసి చానెల్ హోస్ట్‌ మాట్ టావెర్‌( 59).. లైంగిక వేదింపుల వ్య‌వ‌హారంలో అడ్డంగా చిక్కాడు. ఇటీవ‌ల వేదింపుల వ్య‌వ‌హారంపై ఏదీ దాచుకుకోండా ఒక్కొక్క‌రుగా ఓపెన్ అవుతున్న సంద‌ర్భంలో ఇత‌గాడి వ్య‌వ‌హారంపైనా బ‌హిరంగ చ‌ర్చ మొద‌లైంది. ఇత‌గాడి వ‌ల్ల వేదింపుల‌కు గురైన ఎనిమిది మంది మ‌హిళ‌లు ఒక్క‌సారిగా విరుచుకుప‌డ్డారు. మ్యాట్ బారిన ప‌డి తాము ఎలా వేదింపుల‌కు గుర‌య్యారో వివ‌రిస్తూ ఏకంగా స‌మాజిక మాధ్య‌మాల్లో పోస్టింగులు పెట్ట‌డంతో అస‌లు బండారం బ‌య‌లికొచ్చింది.

అంతేకాదు.. ఈ వ్య‌వ‌హారం పెచ్చు మీరుతుండ‌డంతో అత‌డు ఏకంగా ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్ర‌మ్‌ల‌ను బ్లాక్ చేసేశాడు. సారీ సారీ అంటూనే .. నేనే త‌ప్పు చేయ‌లేదు. ఇలా నిందారోప‌ణ‌లు, అసత్య ప్ర‌చారాలు చేయ‌డం త‌గ‌దంటూ ఎదురుదాడికి దిగాడు. అంతేకాదు.. త‌న న్యూయార్క్‌లోని త‌న ఇంటి ప్రాంగ‌ణంలో హ‌డావుడిగా త‌న వ్య‌క్తిగ‌త లాయ‌ర్ స‌మ‌క్షంలో ప్రెస్‌మీట్ పెట్టాడు. త‌న‌వ‌ల్ల బాధ‌ప‌డ్డామ‌ని చెబుతున్న వారంద‌రికీ సారీ. అయితే వేరే కారణాల వ‌ల్ల ఇలాంటి ఆరోప‌ణ‌లు చేసి ఇరికించ‌డం స‌రికాద‌ని స‌ర్ధి చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. మొత్తానికి మ్యాట్ అనే క్యాట్ కూడా వేదింపుల గొడ‌వ‌ల్లో అడ్డంగా బుక్కైన మాట వాస్త‌వం!

  •  
  •  
  •  
  •  

Comments