80 కోట్లతో యోగాగురూ బాబా రాందేవ్‌పై టీవీ సిరీస్‌

Saturday, February 10th, 2018, 02:21:38 PM IST

దాదాపు 80 కోట్ల బ‌డ్జెట్‌తో యోగా గురూ, `ప‌తంజ‌లి` ఎంట‌ర్‌ప్రెన్యూర్‌ బాబా రాందేవ్‌పై టీవీ సిరీస్ తెర‌కెక్క‌డం హాట్ టాపిక్‌గా మారింది. `స్వామి రాందేవ్‌: ఏక్ సంగ్రాహ్‌` అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ టీవీ సిరీస్ ప్రివ్యూని ఈ శ‌నివారం 20,000 మంది స‌మ‌క్షంలో లైవ్ చేయ‌డం విశేషం. అంత మంది స‌మ‌క్షంలో మెగా స్పెష‌ల్ ప్రివ్యూ ఏర్పాటు చేసిన ఈ ప్రివ్యూలో బాబా రాందేవ్ పాల్గొన్నారు. దిల్లీ ఛ‌త్ర‌సాల్ స్టేడియంలో ఈ కార్య‌క్ర‌మం అంగ‌రంగ వైభ‌వంగా సాగింది.

ఆచార్య బాల‌కిష‌న్, డిస్క‌వ‌రీ క‌మ్యూనికేష‌న్స్ ఇండియా సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ ఆఫ్ సౌత్ ఆసియా క‌ర‌ణ్ బ‌జాజ్‌, టీవీ సిరీస్ న‌టీన‌టులు క్రాంతి ప్ర‌కాష్ ఝా, నామ‌న్ జైన్‌, దీపాల్ జోషి త‌దిత‌రులు ఈ ప్రీమియ‌ర్‌కి ఎటెండ‌య్యారు. డిస్క‌వ‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ చానెల్- జీత్ లో 85 ఎపిసోడ్లు టెలీకాస్ట్ చేయ‌నున్నారు. స‌మాజానికి బుద్ధి విష‌యంలో శుద్ధి ఎంతో అవ‌స‌రం. బాబా రాందేవ్ ఒక సామాన్యుడి నుంచి మాన్యుడిగా, ఎంట‌ర్‌ప్రెన్యూర్‌గా ఎదిగేందుకు ఎలా శ్ర‌మించార‌న్న‌ది ఈ టీవీ సిరీస్‌లో చూపిస్తున్నారు.