TV5 ఛానల్ అమ్మేస్తున్నారంటూ కథనం.. ప్రముఖ వెబ్‌సైట్‌పై కేసు..!

Tuesday, July 7th, 2020, 11:54:55 AM IST

ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ-5 యాజమాన్య హక్కులు చేతులు మారబోతుందంటూ ఇటీవల ఓ వెబ్‌సైట్ కథనం రాసుకొచ్చింది. అయితే హైదరాబాద్‌కు చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ మరియు ఫార్మా రంగంలో ఉన్న ఒక పెద్ద పారిశ్రామిక సంస్థ ఛానల్‌ను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపించిందని, కానీ ఆ ఒప్పందం కుదరలేదని ఆ కథనంలో పేర్కొంది.

అంతేకాదు ఇప్పుడు దుబాయ్‌ వ్యాపారులు కొనుగోలుకు సిద్థమవుతున్నారని, దాదాపు ఈ డీల్ ఒకే అయినట్టు పేర్కొంది. ఆ వివరాలన్నీ అవాస్తవాలని, ఆ కథనం తమ చానల్‌ పరువు తీసేలా ఉందని పేర్కొంటూ టీవీ-5 ఎండీ రవీంధ్రనాథ్ సదరు వెబ్‌సైట్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.