ఉధృతం చేస్తున్న టీవీ-9, ఏబీఎన్

Monday, September 22nd, 2014, 06:29:31 PM IST

tv9-and-kcr
తెలంగాణలో టీవీ-9, ఏబీఎన్ టీవీ చానళ్ల ప్రసారాలు నిలిచిపోయి వంద రోజులు కావొస్తోంది. ఇప్పటికి ప్రసారాల పునరుద్దరించే విషయంలో స్పష్టత లేదు. దీంతో జర్నలిస్టులు తమ ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేయాలని భావిస్తున్నారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా చెన్నైలో వివిధ మీడియా సంస్థల ప్రతినిధులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
సీఎం కేసీఆర్ జర్నలిస్టుల మనోభావాల్ని దెబ్బ తీసే విధంగా వ్యాఖ్యలు చేయడంపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళ, తెలుగు, మలయాళ మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులు, జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ చెన్నై సభ్యులు చెన్నై ప్రెస్ క్లబ్ వద్ద ధర్నా చేపట్టారు. ప్రతికా స్వేచ్పను కాలరాసే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని చెన్నై ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి భారతీ తమిజాన్ అన్నారు. తెలంగాణలో ప్రైవేట్ ఛానెల్స్ ప్రసారాలపై ఆంక్షలు విధించడాన్ని భారతీ ఖండించారు.

సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ రంగంలోకి దిగారు. తెలంగాణ ఎంఎస్ఓలతో ఆయన చర్చించారు, సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. అయినా ఫలితం శూన్యం. వంద రోజులవుతున్నా.. టీవీ-9, ఏబీఎన్ చానళ్ల ప్రసారాలు పునరుద్దరించే విషయం తేలడం లేదు.