ర‌విప్ర‌కాష్ త‌ప్పించుకునే వీలు లేదు!

Monday, June 10th, 2019, 12:00:59 AM IST

టీవి9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాష్ చుట్టు ఉచ్చు బిగుస్తోంది. గ‌త మంగ‌ళ‌వారం పోలీసుల ముందు హాజ‌రైన ర‌విప్ర‌కాష్ విచార‌ఫ‌కు స‌హ‌క‌రిస్తాన‌ని బ‌య‌టికి చెబుతూనే మీడియాకు తెలంగాణ అమ్రీష్‌పురీకి మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధం అంటూ భిన్న స్లోగ‌న్‌లు ఇవ్వ‌డం మొద‌లుపెట్టారు. పోలీసుల‌కు కూడా విచార‌ణ‌లో పొంత‌న లేని స‌మాధాన‌లు చెబుతూ త‌ప్పించుకునే ప్ర‌య‌త్నాలు చేశార‌ని సైబ‌రాబాద్ క్రైమ్ ఏసీపీ శ్రీ‌నివాస్ ఆదివారం మీడియాకు వెల్ల‌డించారు. ర‌విప్ర‌కాష్ త‌ను నిర్దోషిన‌ని నిరూపించుకునే ఆధారాలేవి త‌న వ‌ద్ద లేవ‌ని. అత‌ను ఇక త‌ప్పించుకునే అవ‌కాశం లేద‌ని ఆదివారం హైద‌రాబాద్‌లో మీడియాకు వెల్ల‌డించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

ర‌విప్ర‌కాష్ దోషి అని నిరూపించే కీల‌క ఆధారాలు మా వ‌ద్ద వున్నాయ‌ని, ర‌విప్ర‌కాష్ పై మాకు అందిన ఫిర్యాదు మేర‌కు అత‌న్ని విచారిస్తున్నామని ఏసీపీ శ్రీ‌నివాస్ మీడియాకు వెల్ల‌డించారు. గ‌త మూడు రోజులుగా త‌న‌ని విచారిస్తున్న‌ప్ప‌టికీ పొంత‌న లేని స‌మాధానాలు చెబుతూ దాట‌వేస్తున్నాడ‌ని, ఈ వుందంలో మ‌రో వ్య‌క్తి అయిన శివాజీ కుటుంబ స‌భ్యుల‌కు కూడా పోటీసులు అంద‌జేశామ‌ని అయితే త‌ను హైద‌రాబాద్ వ‌చ్చిన త‌రువాత ఈ విష‌యాన్ని తెలిజేస్తామ‌ని కుటుంబ స‌భ్యులు చెప్పిన‌ట్లు ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మూడు రోజుల పాటు చేసిన విచార‌ణ సారాంశాన్ని, సోదాల్లో ల‌భించిన ఆధారాల్ని సోమ‌వారం కోర్టులో నివేదిస్తామ‌ని తెలియ‌జేశారు. సైబ‌ర్ క్రైమ్ ఏసీపీ చెబుతున్న విష‌యాల‌ని బ‌ట్టి ర‌విప్ర‌కాష్‌ని అంత ఆషామాషీగా వ‌దిలేలా క‌నిపించ‌డం లేదు. ఖ‌చ్చితంగా అత‌న్ని జైలుకు పంపించేలా ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాలున్నాయ‌ని తెలుస్తోంది.