ర‌విప్ర‌కాష్ ఇక ముగిసిన అధ్యాయ‌మేనా?

Thursday, June 13th, 2019, 10:14:46 AM IST

టీవి9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాష్ సెల్ఫ్‌గోల్ చేసుకున్న‌ట్టేనా? అంటే జ‌రుగుతున్న ప‌రిణామాలు, మంగ‌ళ‌వారం త‌ను కోర్టుకు వెల్ల‌డించిన విష‌యాల్ని బ‌ట్టి చూస్తుంటే వంద‌కు వంద శాతం క‌రెక్టే అనిపిస్తోంది. ఫోర్జ‌రీ, నిధుల బ‌ద‌లాయింపు, టీవి9 లోగో విక్ర‌యం వంటి నేరాభియోగాల కార‌ణంగా ర‌విప్ర‌కాష్ విచార‌ణ ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. అయితే ఇటీవ‌ల జ‌రుగుతున్న, జరిగిన ప‌రిణామాల్ని విశ్లేష‌శించుకున్న ర‌విప్ర‌కాష్ టీవి9 పుట్టుకే హ‌వాలా సొమ్ముతో ముడిప‌డి వుంద‌ని హైకోర్టు సాక్షిగా చెప్ప‌డం క‌ల‌క‌లం రేపుతోంది. కాశ్మీర్ ఉగ్ర‌వాదుల‌కు హ‌వాలా ద్వారా నిధులు త‌ర‌లిస్తారు. అదే ప‌ద్ద‌తిలో హ‌వాలా మార్గంలో వ‌చ్చిన అక్ర‌మ నిధుల‌తోనే టీవి9 పుట్టింద‌ని చెప్పి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేశారు.

మెరుగైన స‌మాజం కోసం.. క‌లు ర‌హిత స‌మాజాన్ని స్థాపిద్దాం. క‌ట్నం అడిగిన వాడు గాడిద‌. ఫ్యాక్ష‌నిస్టుల ఆస్తులన్నీ జాతీయం చేయాలి.. ఇలా నీత వాఖ్యాలు చెప్పి జ‌నాల్లో మంచి మార్కులు కొట్టేసిన ఛాన‌ల్ పుట్టుకే అవినీతి మ‌యం అన్న భ‌యంక‌ర‌మైన నిజం బ‌య‌టికి రావ‌డంతో జ‌నాల‌కే నీతులు, ఆ నీతులు ఛాన‌ల్‌కు ప‌నికిరావా? ఎంత మోసం. అవినీతో అక్ర‌మంగా పుట్టుకొచ్చిన టీవి ఛాన‌ల్ యాజ‌మాన్యం అదే అవినీతిపై పోరాటం అంటూ క‌ల్ల‌బొల్లి మాట‌లు చెప్పి జ‌నాల‌ని పిచ్చి వాళ్ల‌ని చేసిందని ర‌విప్ర‌కాష్ ప‌ద‌విలో వున్నంత కాలం డ‌బ్బున్న వాళ్ల‌ని, సెల‌బ్రిటీల‌ని బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్లు కూడ‌బెట్టాడ‌ని ర‌విప్ర‌కాష్‌పై సామాన్య జ‌నం దుమ్మెత్తిపోస్తున్నారు.

ఇక ఇటీవ‌ల త‌న‌పై జ‌రుగుతున్న దాన్ని మీడియాకు మాఫియాకు జ‌రుగుతున్న య‌ద్ధంగా చిత్రీక‌రించి మీడియా ముందు మీడియా ఐక్య‌త వ‌ర్థిల్లాలి అంటూ ర‌విప్ర‌కాష్ పెట్టిన కేక‌ల‌కు, మంగ‌ళ‌వారం ఆయ‌న చెప్పిన మాట‌ల‌కు తెలుగు మీడియా ప‌క్కున న‌వ్వు స్టార్ వున్న‌న్నాళ్లు ఎంత నీల్గాడు. మిగ‌తా ఛాన‌ల్ వాళ్ల‌ని పురుగుల్లా చూసి ఇప్పుడు న‌క్క విన‌యాలు ప్ర‌ద‌ర్శిస్తూ త‌న ఛాన‌ల్ కొనుగోలు దారుల‌కు త‌న‌కు మ‌ధ్య జ‌రుగుతున్న వ‌ర్గ పోరును మీడియాపై జ‌రుగుతున్న ద‌మ‌న‌కాండ‌గా చిత్రీక‌రించి త‌ప్పించుకోవాల‌ని ర‌విప్ర‌కాష్ పెద్ద ప్లానే వేశాడ‌ని, కానీ అదే ప్లాన్‌తో సెల్ఫ్‌గోల్ చేసుకున్నాడ‌ని మీడియా వ‌ర్గాలు నవ్వుకుంటున్నాయి. ఇంత వ‌ర‌కు స‌పోర్ట్‌గా నిలిచిన టివి9 సిబ్బంది ర‌విప్ర‌కాష్ తాజా వ్యాఖ్య‌ల‌తో త‌మ ఉనికే ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డింద‌ని అత‌నిపై గుర్రుగా వున్నాయ‌ట‌. ఎదుటి వ్య‌క్తి జీవితాన్ని త‌న ఛాన‌ల్‌లో బ్రేకింగ్ వేసి పైశాచిక ఆనందాన్ని పొందిన ర‌విప్ర‌కాష్ చివ‌రికి తానే బ్రేకింగ్ న్యూస్ అవుతాన‌ని ఊహించ‌క‌పోవ‌డం విధి ఎంత బ‌లీయ‌మైన‌దో చెబుతోంది.