ర‌విప్ర‌కాష్ ఎపిసోడ్‌లో ఏది నిజం ఏది అబ‌ద్ధం!

Wednesday, June 12th, 2019, 10:31:14 AM IST

టీవి9 మాజీ సీఈఓ ర‌విప్ర‌కాష్ వివాదంలో ఏది నిజం ఏది అబ‌ద్ధం అనే వాద‌న వినిపిస్తోంది. ఫోర్జ‌రీ సంత‌కం, టీవి9 లోగో అమ్ముకునే ప్ర‌య‌త్నం చేయ‌డం, సంస్థ నిధుల్ని ప‌క్క‌దారి ప‌ట్టించార‌న్నఅభియోగాల కార‌ణంగా ర‌విప్ర‌కాష్ గ‌త నెల రోజులుగా త‌ప్పించుకు తిరిగారు. అయితే అత‌నికి హైకోర్ట‌లోనూ, సుప్రీమ్ కోర్టు లోనూ ఊర‌ట ల‌భించ‌క‌పోవ‌డంతో త‌న‌కు ముంద‌స్తు బెయిల్ ఇవ్వ‌డానికి ఈ రెండు న్యాయ‌స్థానాలు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో ర‌విప్ర‌కాష్ గ‌త్యంత‌రం లేక గ‌త మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ పోలీసుల ఎదుట హాజ‌ర‌య్యారు. మూడు రోజులు విచార‌ణ‌కు హాజ‌రైనా పోలీసుల‌కు స‌హ‌క‌రిచ‌క‌పోవ‌డంతో సోమ‌వారం ఆయ‌న‌ను కోర్టులో హాజ‌రు ప‌రిచారు. ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న హైకోర్టు ధ‌ర్మాస‌నం విచార‌ణ‌ను వ‌చ్చే మంగ‌ళ‌వారానికి వాయిదా వేసింది.

ర‌విప్ర‌కాష్ ఎపిసోడ్ మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి ప్రింట్ అండ్ ఎల‌క్ట్రానిక్ మీడియా ఒకే త‌ర‌హాలో ఆయ‌న‌ను ట్రీట్ చేస్తోంది. త‌ప్పుడు ప‌నుల‌కు పాల్ప‌డ్డ‌డ‌ని, సంస్థ లోగోను అమ్ముకోవ‌డానికి త‌ప్ప‌డు దారిని ఎంచుకున్నాడ‌ని ప్రింట్ మీడియా ప‌తాక శీర్షిక‌ల్లో వార్త‌ల్ని ప్ర‌చురించింది. ఎల‌క్ట్రానిక్ మీడియా కూడా అదే స్థాయిలో వార్త‌ల్ని ప్ర‌సారం చేసింది. ఎల‌క్ర‌టానిక్ మీడియా ర‌విప్ర‌కాష్‌కు అండ‌గా నిల‌వ‌క‌పోవ‌డానికి కార‌ణం అత‌ని ప్ర‌వ‌ర్త‌నే. మామూలుగా వున్న స‌మ‌యంలో త‌న టీవి ఛాన‌ల్ త‌ప్ప మిగ‌తావ‌న్న ప‌నికిరాని డ‌బ్బాల‌న్న చందంగా, మీడియా ప్ర‌పంచానికి తిరుగులేని మ‌హారాజుని నేనే అన్న త‌ర‌హాలో ర‌విప్ర‌కాష్ అప్ప‌ట్లో తెగ బిల్డ‌ప్ ఇచ్చారు. అదే స‌హ ఎల‌క్ట్రానికి బృందానికి ఎక్క‌డో కాలేలా చేసింది. మా చేతికి ఎప్పుడైనా దొర‌క్క‌పోతాడా? అప్పుడు త‌న‌పై వున్న క‌సిని చూపించ‌క‌పోతామా అని ఇన్నాళ్లుగా ఎదురుచూశాయి. వాటికి త‌గ్గ రోజు రానే వ‌చ్చింది. దాంతో రెచ్చిపోయి ర‌విప్ర‌కాష్‌ని ఏ స్థాయిలో విల‌న్‌ని చేసి చూపించాలో ఆ స్థాయిలో చూపించే ప్ర‌య‌త్నం చేశారు.

కానీ సోష‌ల్ మీడియాలో వాద‌న మాత్రం ఇందుకు భిన్నంగా వినిపిస్తోంది. ఓ ప‌క్క నెగ‌టీవ్‌గా ర‌విప్ర‌కాష్‌ని విమ‌ర్శ‌స్తున్న వారూ వున్నారు. స‌పోర్ట్ చేస్తూ త‌మ వాద‌న వినిపిస్తున్న వారూ వున్నారు. మీడియా అంటే భ‌యం పుట్టించారు కాబ‌ట్టి ఒక విధంగా హీరోనే అని ఓ వ‌ర్గం అంటే దాన్ని అడ్డుపెట్టుకుని ఎంత దోచుకోవాలో అంత దోచుకున్నాడ‌ని, ఎక్క‌డో విదేశాల్లో ఆ సొమ్మునంతా దాచుకున్నాడ‌ని మ‌రో వ‌ర్గం ర‌విప్ర‌కాష్‌పై దుమ్మెత్తిపోస్తోంది.