స్నేహితుడి కోసం శివాజీ కూడా రంగంలోకి దిగాడు!

Tuesday, June 11th, 2019, 11:21:27 PM IST

టీవి9 వివాదంలో టీవి9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాష్ టీవి9 హ‌వాలా డ‌బ్బుతో పుట్టుకొచ్చిన ద‌త్త‌పుత్రిక అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ వివాదంలో వాద‌న‌లు విన్న హైకోర్టు న్యాయ‌మూర్తి త‌దుప‌రి విచార‌ణ‌ను వ‌చ్చే మంగ‌ళ‌వారానికి వాయిదా వేశారు. ఇక ఇదే వివాదంలో చిక్కుకున్న హీరో శివాజీ కూడా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. హైద‌రాబాద్ సిటీ పోలీసులు రెండు ద‌ఫాలుగా శివాజీకి నోటీసులు ఇచ్చినా, అత‌నితో పాటు ర‌విప్ర‌కాష్పై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసినా కించిత్ కూడా వెన‌క్కి త‌గ్గ‌లేదు.

ఓ ప‌క్క ర‌విప్ర‌కాష్ హై కోర్టుకు హాజ‌రై త‌న వాద‌న‌లు వినిపిస్తుంటే మ‌రో ప‌క్క శివాజీ క్వాష్ పిటీష‌న్ వేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. త‌న‌పై తెలంగాణ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు పెట్టిన కేసుని ఉప‌సంహ‌రించుకునేలా ఆదేశాలు జారీ చేయాల‌ని కోరుతూ హైకోర్టులో మంగ‌ళ‌వారం క్వాష్ పిటీష‌న్‌ను వేశారు. విచార‌ణ‌కు హాజ‌రు కాకుండా గత నెల రోజులుగా త‌ప్పించుకు తిరుగుతున్న శివాజీ పిటీష‌న్‌ను హైకోర్టు ధ‌ర్మాస‌నం విచార‌ణ‌కు స్వీక‌రిస్తుందా? లేక హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల ముందు శివాజీ హాజ‌రు కావాల్సిందే అని ఆదేశాలు జారీ చేస్తుందో చూడాలి.