వైరల్ వీడియో: విచక్షణ రహితంగా జవాన్లపై కర్రలతో దాడి..!

Sunday, June 2nd, 2019, 06:35:42 PM IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని భాగ్‌పత్‌లో ఓ హోటల్ జరిగిన ఉదంతం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఒక ఇద్దరు జవాన్లు భాగ్‌పత్‌లో ఒక హోటల్‌కు వెళ్ళారు. వారు హోటళ్ళో ఉన్న సమయంలో అక్కడి పని చేస్తున్న సిబ్బందికి మరియు ఇద్దరు జవాన్లకు ఏదో చిన్న గొదవ వచ్చింది. అయితే ఆ గొడవ కాస్త మాటా మాట పెరిగి పెద్దదైపోయింది. అయితే వారు ఒకరినొకరు కొట్టుకోవడం కూడా ప్రారంభించారు.

అయితే ఒక్కసారిగా ఆ ఇద్దరి జవాన్‌లపై అక్కడున్న సిబ్బంది అందరూ కలిసి దాడికి పాల్పడ్డారు. అయితే అసభ్య పదజాలంతో కర్రలు, చేతులతో ఇష్టం వచ్చినట్లు రక్తం కారేలా జవాన్లపై దాడికి పాల్పడ్దారు. అప్పటికి ఎదురు తిరిగి వారి నుంచి తప్పించుకోడానికి ప్రయత్నం చేసినా జవాన్‌లు ఇద్దరే ఉండడంతో ప్రత్యర్ధి గుంపుగా ఉండడంతో అది సాధ్యం కాలేకపోయింది. అయితే విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని జవాన్లను ఆసుపత్రికి తరలించారు. అంతేకాదు దాడికి పాల్పడిన హోటల్ సిబ్బంది ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగిందో ఏమో కానీ దేశ రక్షణ కోసం పని చేసే జవాన్‌లపై ఇలా దాడి చేయడం సబబు కాదని నెటిజన్‌లు ఆ దాడి చేసిన వ్యక్తులపై మండిపడుతున్నారు.