వైసీపీకి ఇద్దరు ముఖ్యమంత్రులా..ఇప్పుడిదే ట్రెండింగ్ టాపిక్!

Tuesday, September 10th, 2019, 04:07:02 PM IST

ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పక్క వైసీపీ మరోపక్క జనసేన పార్టీల అభిమానుల మధ్య తారా స్థాయిలో రచ్చ నడుస్తుంది.ఈ రెండు పార్టీలకు సోషల్ మీడియా పరంగా బలం ఎక్కువ ఉండడంతో వీరు ఎల్లప్పుడూ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటే ఉంటారు.ఈ ఎన్నికలు గడిచిన తర్వాత ఈ తీవ్రత మరింత పెరిగింది.ఇదిలా ఉండగా ఈ మధ్యన వైసీపీ మంత్రి బొత్స సత్యన్నారాయణ చేసిన కామెంట్స్ కూడా జనసేన శ్రేణుల్లో రచ్చ రేపగా బొత్స ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారని పవన్ అసలు విషయం బయటపెట్టారు.

దీనితో బొత్సపై జనసేన శ్రేణులు అందుకున్నారు.వైసీపీలో ఆఫీసియల్ గా జగన్ ముఖ్యమంత్రి అయితే ఆ పార్టీకు రెండో ముఖ్యమంత్రి మాత్రం బొత్స అని కామెంట్స్ చేస్తున్నారు.అంతే కాకుండా జనసేన పార్టీ తెదేపాకు బి టీమ్ అని మీడియా ముందు అనడంతో ఆ వ్యాఖ్యలను తప్పుబడుతూ బొత్స సోషల్ మీడియా ముఖ్యమంత్రి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి వైసీపీలో ఇద్దరు ముఖ్య మంత్రులు అన్న మాట మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయ్యింది.