పుల్లూరు చెక్ పోస్ట్ వద్ద బారులు తీరిన ఏపీ అంబులెన్సులు

Friday, May 14th, 2021, 12:35:31 PM IST


తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ కట్టడికి ఇరు రాష్ట్రాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే తెలంగాణ లో పలు చోట్ల పడకలు దొరక్క అంబులెన్స్ లలోనే వేచి ఉన్న పరిస్తితి గత కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తెలంగాణ లో అనుమతి ఉంటేనే అంబులెన్సులను, కరోనా వైరస్ రోగులను రానిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను అధికారులు పక్కగా అమలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసుల మోహరింపు తో పాటుగా, బోర్డర్ లో హెల్త్, రెవెన్యూ, పోలీసుల బృందాలు ఉన్నాయి. ఆసుపత్రి లో టై ఏపీ ఉంటేనే అనుమతి ఇస్తున్నారు.

అయితే తెలంగాణ సరిహద్దు పుల్లూరు చెక్ పోస్ట్ వద్ద ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంబులెన్స్ లు బారులు తీరాయి. కొన్నిటికి హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు అధికారులు. అయితే పడిగాపులు కాచి అంబులెన్స్ లోనే ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు బాధితులు. అయితే పదుల సంఖ్యలో అంబులెన్స్ లు మళ్ళీ వెనక్కి వెళ్ళాయి. అయితే ఇరు రాష్ట్ర ప్రభుత్వాల పై పలువురు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.