ఒకే టైటిల్ కోసం ఇద్దరు దర్శకుల ఫైట్ ?

Thursday, February 22nd, 2018, 10:45:57 PM IST

ప్రసుత్తం టాలీవుడ్ లో ఓ కొత్త టైటిల్ పై ఇద్దరు దర్శకులు మాదంటే మాది అంటూ నానా రభస చేస్తున్నారు. ఇంతకీ ఆ టైటిల్ ఏమిటో తెలుసా అహం బ్రహ్మాస్మి? ఈ టైటిల్ కోసం ఓ వైపు క్రేజీ దర్శకుడు క్రిష్ ప్రయత్నాలు చేస్తుండగా .. మరో వైపు ఘాజి తో సంచలన దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న సంకల్ప్ రెడ్డి కూడా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ ఇద్దరు దర్శకులు కూడా ఈ టైటిల్ అనుకున్నది ఒకే హీరోకోసం కావడం విశేషం !! ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా మెగా హీరో వరుణ్ తేజ్ !! ఆ వివరాల్లోకి వెళితే .. ప్రస్తుతం మణికర్ణికా సినిమా తెరకెక్కిస్తున్న క్రిష్ తన తదుపరి చిత్రంగా వరుణ్ తో అహం బ్రహ్మాస్మి అనే టైటిల్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. మరో వైపు సంకల్ప్ రెడ్డి ఇప్పటికే స్పేస్ నేపథ్యంలో ఓ సినిమాను ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాడు .. ఆ సినిమా టైటిల్ అహం బ్రహ్మాస్మి యే !! మొత్తానికి ఒక భర్త కోసం ఇద్దరు భార్యలు కొట్టుకున్నట్టు ఇలా ఒకే హీరో , ఒకే టైటిల్ కోసం ఇద్దరు దర్శకులు పోటీ పడుతుండడం అందరికి షాక్ ఇస్తుంది. మరి ఈ టైటిల్ ఎవరికీ ఓకే అవుతుందో చూడాలి !!