పవన్ – చిరు పేరు వల్ల కొట్టుకున్న అభిమానులు

Friday, September 29th, 2017, 09:09:38 PM IST


ప్రస్తుత రోజుల్లో కొందరి అభిమానులు ఆగ్రహాలు తార స్థాయికి చేరుతున్నాయి. చిన్నచిన్న కారణాలకు గొడవలకు దిగుతున్నారు. అయితే రీసెంట్ గా ఓ పార్క్ పేరు విషయంలో రెండు గ్రూపులు ఇష్టమా వచ్చినట్టుగా కొట్టుకున్నారు. తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటన పశ్చిమగోదావరిలోని ఉరదాల పాలెంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఉండే గ్రామస్థులు అందరు ఒక పార్కును ఏర్పాటు చేసుకున్నారు.

అయితే ఆ పార్కుకు చిరు-పవన్ అని పేరు పెట్టాలని ఓ వర్గం వారు తెలిపారు. దానికి మరో వర్గం యువకులు ఒప్పుకోలేదు. మొదట మాటలతో సాగిన వారి వ్యవహారం గొడవల వరకు వెళ్ళింది. తీవ్ర స్థాయిలో ఇరు వర్గాలు గొడవప డుతుండడంతో వేరొకరు ఆపే ప్రయత్నం చేయలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గొడవను ఆపారు. కొందరు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ తరహా ఘటనలు ఇంతకుముందు కూడా జరిగాయని గ్రామస్థులు చెబుతున్నారు. మరొకసారి ఈ గొడవలు జరగకుండా ఇరువర్గాలకు పోలీసులు హెచ్చరికలను చేసినట్లు తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments