సరికొత్త ట్విస్ట్ : దిశ నిందితుల్లో ఇద్దరు మైనర్లు…?

Tuesday, December 10th, 2019, 10:01:40 AM IST

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచార, హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే. అయితే అంతటి దురాగతానికి పాల్పడినటువంటి నలుగురు మృగాలను పోలీసులు, దిశ ని దహనం చేసిన ప్రదేశంలోనే ఎన్‌కౌంటర్‌ చేసి చంపేశారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా దేశ ప్రజలందరూ కూడా ఈ పోలీసులకు మద్దతు ఇస్తుంటే, కొందరు మాత్రం పోలీసులకు వ్యతిరేకంగా సంచలన వాఖ్యలు చేస్తున్నారు. కాగా ఈ నిందితులకు సంబంధించి ఒక ఒక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.

కాగా ఈ నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారని నిందితుల తల్లిదండ్రులు వెల్లడిస్తున్నారు. కాగా ఈ నిందితుల్లో మహ్మద్ ఆరిఫ్ వయసు 26 ఏళ్లు కాగా, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవుల వయసు 20 ఏళ్లని పోలీసులు ఇది వరకే వెల్లడించారు. అయితే అవి తప్పుడు లెక్కలని, పోలీసులు అబద్దాలు చెప్పారని నిందితుల తల్లిదండ్రులు ఆరోపిస్తు, మానవ హక్కుల సంఘానికి వెల్లడించారని సమాచారం.

అయితే నిందితుల ఆధార్ కార్డు ప్రకారం… ఒక నిందితుడి పుట్టిన రోజు ఆగస్టు 15, 2002, అంటే అతడికి 17 ఏళ్ళు కాగా, మరో నిందితుడి పుట్టిన తేదీ 10 ఏప్రిల్ 2004, అంటే అతడికి 15 ఏళ్లుగా తెలుస్తుంది. కాగా ఈ నిందితుల వయసుపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే డ్రైవర్లుగా ఉన్న ఆరిఫ్, చెన్నకేశవులు లారీ డ్రైవర్లు అని, వారికి డ్రైవింగ్ లైసెన్స్ లేదని సమాచారం. ఇకపోతే మైనర్లని కూడా చూడకుండా అన్యాయంగా తమ కొడుకులను ఎందుకు చంపేశారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.