మన అర్జున్ రెడ్డికి ఇది అసలైన పరీక్ష..!

Saturday, September 22nd, 2018, 06:45:07 PM IST


ముందు సాదా సీదా చిత్రాలతోనే తెరపైకి వచ్చి హీరో స్నేహితుడి పాత్రలు చేసుకుంటూ చిన్నపాటి విజయంతో భారీ హిట్ అందుకున్న మన అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండకు ఇప్పుడు అసలైన పరీక్ష ఎదురు కానుంది,తన కన్నా ముందే హీరోలుగా ఉన్న ఎంతో మంది హీరోలను మించిన క్రేజ్ విజయ్ సంపాదించుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు,దానికి నిదర్శనమే గీత గోవిందం చిత్రం.

ఎప్పటికప్పుడు వైవిధ్యభరిత కథలను ఎంచుకుంటూ తనదైన నటనతో రౌడీ అనిపించుకున్నాడు విజయ్.అర్జున్ రెడ్డి చిత్రంతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యిపోయాడు.గీత గోవిందం చిత్రం విడుదలకు ముందే పైరసీ భూతం అలుముకున్నా సరే ఎవరూ ఊహించని రీతిలో భారీ విజయాన్ని అందుకున్నాడు,కానీ ఇప్పుడు వచ్చే తన తర్వాతి సినిమా “నోటా”తో తన అదృష్టాన్ని మళ్ళీ పరీక్షించుకోబోతున్నాడు.ఇప్పటికే వివాదాల్లో ఉన్న ఈ సినిమాని తెలుగు మరియు తమిళం రెండు భాషల్లోనూ అక్టోబరు 5 వ తేదీన విడుదల చెయ్యడానికి సిద్ధం చేస్తున్నారు.ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు అన్నది హాట్ టాపిక్ గా మారింది.గీత గోవిందం లాంటి భారీ హిట్ తర్వాత రాబోతున్న చిత్రం కావడంతో ఈ చిత్రం మీద కూడా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.వాటిని అందుకుంటాడా లేదా అన్నది మనం వేచి చూడాలి..