`ఉద‌య్‌కిర‌ణ్ బ‌యోపిక్‌` గొడ‌వ‌ల‌వుతాయేమో?

Thursday, May 17th, 2018, 12:10:19 PM IST

ద‌ర్శ‌కుడు తేజ ఉద‌య్‌కిర‌ణ్ బ‌యోపిక్ తెర‌కెక్కించేందుకు ఆస‌క్తిగా ఉన్నార‌ని, ఇప్ప‌టికే ఆ ప‌నులు మొద‌లుపెట్టార‌ని టాలీవుడ్‌లో ప్ర‌చారం సాగుతోంది. దీనిపై ఫిలింక్రిటిక్స్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఉద‌య్‌కిర‌ణ్ బ‌యోపిక్ అంటే పూర్తిగా మెగా ఎఫైర్ కిందే లెక్క‌. మెగా కాంపౌండ్ ఇష్యూస్‌తో ముడిప‌డిన అంశ‌మిది. అలాంటి వివాదంలో తేజ వేలు పెట్ట‌డ‌మేన‌ని స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఒక సామాన్యుడు అసామాన్యంగా ఏకంగా వెండితెర హీరోగా ఎదిగిన వైనం ఎంతో ఉద్విగ్న‌భ‌రిత‌మైన‌ది. చిత్రం అనే సినిమాతో ఉద‌య్‌కిర‌ణ్‌ని హీరోని చేసిన తేజ‌, ఆ వెంట‌నే నువ్వు నేను చిత్రంతో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్‌ని అందించి తిరుగులేని హీరోని చేశాడు. అయితే ఆ త‌ర‌వాత ఆ స్టార్‌డ‌మ్‌ని నిల‌బెట్టుకోవ‌డంలో ఉద‌య్‌కి ర‌క‌ర‌కాల అవాంత‌రాలేర్ప‌డ్డాయి. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుశ్మిత‌తో నిశ్చితార్థం జ‌ర‌గ‌డం, అటుపై కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ పెళ్లి ర‌ద్ద‌వ్వ‌డం ఉద‌య్ జీవితంలో కీల‌క మ‌లుపు. ఉద‌య్‌పై అప్ప‌ట్లో ర‌క‌ర‌కాలుగా ప్ర‌చార‌మైంది. అందులో వాస్త‌వం ఎలా ఉన్నా… ఆ క్ర‌మంలోనే మెగా ఫ్యాన్స్ అత‌డి సినిమాలు చూడ‌డం మానేశార‌న్న‌ది నిర్వివాదాంశం. ఆ ప్ర‌భావం ఉద‌య్ కెరీర్‌పై తీవ్రంగా ప‌డింద‌ని విశ్లేషించారు కొంద‌రు. అయితే ఈ విష‌యంలో ఉద‌య్ త‌ప్పిదం తెలిసీతెలియ‌క జ‌రిగిపోయిన‌ది. మ‌ర‌ణానికి ముందు ఉద‌య్‌కిర‌ణ్ ఓ ఇంట‌ర్వ్యూలో ఎన్నో ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని వెల్ల‌డించాడు. హీరో అవ్వాల‌న్న ఉత్సాహంలో ఏదేదో చేసేశాను. ఆ ఏజ్‌లో ఎక్కువ ఎగ్జ‌యిటెడ్‌గా ఉండేవాడిని.. అలా కొన్ని త‌ప్పులు నాకు తెలియ‌కుండానే జ‌రిగిపోయాయ‌ని ఉద‌య్‌కిర‌ణ్ ఆవేద‌న‌గా మీడియా ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. అయితే చివ‌రి రోజుల్లో అత‌డు కెరీర్ ప‌రంగా స‌త‌మ‌త‌మ‌వ్వ‌డ‌మే గాకుండా, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చివ‌రికి అదే కుటుంబంలో క‌ల‌త‌ల‌కు కార‌ణ‌మైంది. ఓ ఉద్విగ్న క్ష‌ణాన ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించాయి ఈ స‌న్నివేశాలు. ఇవ‌న్నీ తేజ బ‌యోపిక్‌లో చూపించ‌గ‌ల‌డా? ఒక‌వేళ ఎంత వివాదాలు వ‌ద్ద‌నుకున్నా.. మెగా ఫ్యామిలీతో ఎపిసోడ్స్‌ని సినిమా నుంచి ఎలా తొల‌గించ‌గ‌ల‌డు? అంటూ ఆస‌క్తిక‌ర డిబేట్ న‌డుస్తోంది. మ‌రి ఉద‌య్‌కిర‌ణ్ బ‌యోపిక్ అన‌గానే ఇటు మెగాభిమానులు ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. ఇంత‌కీ తేజ మెగా కాంపౌండ్‌తో పెట్టుకుంటాడా?

  •  
  •  
  •  
  •  

Comments