తెరపైకి ఉదయ్ కిరణ్ బయోపిక్ ?

Thursday, May 17th, 2018, 03:09:03 AM IST

మహానటి విజయంతో టాలీవుడ్ లో బయోపిక్ సినిమాల క్రేజ్ బాగా పెరిగింది. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్, పుల్లెల గోపీచంద్ బయోపిక్ లు తెరపైకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. వీటితో పాటు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కథతో మెగాస్టార్ సైరా సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు పలువురు స్టార్స్ బయోపిక్ లు తెరకెక్కించాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌందర్య, దాసరి నారాయణ రావు లాంటి ప్రముఖ స్టార్స్ పై సినిమాలు తెరకెక్కించే ఆలోచనలు జరుగుతున్నాయి. తాజాగా మరో యువ హీరో బయోపిక్ పై చర్చలు జరుగుతున్నాయి. ఆ యువ హీరో ఎవరో కాదు .. ఉదయ్ కిరణ్? ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ జీవితం తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అయితే ఈ సినిమాను దర్శకుడు తేజ తెరకెక్కిస్తే బాగుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం ఏమి జరుగుతుందో.

  •  
  •  
  •  
  •  

Comments