పవన్ కోసం హాట్ యాంకర్ ను దింపుతున్నారట ?

Wednesday, September 27th, 2017, 05:39:40 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 25వ సినిమా వచ్చే జనవరిలో విడుదలకు సిద్ధం అవుతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబందించిన మేజర్ షూటింగ్ అంతా పూర్తీ చేశారట. ఇటీవలే విదేశాల్లో కూడా చిత్రీకరణ మొదలు పెట్టారు. ఇంతవరకు టైటిల్ మాత్రం ఫిక్స్ చేయలేదు. తాజాగా ఈ సినిమా పై మరో కొత్త రూమర్ చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఓ హాట్ యాంకర్ ని దింపుతున్నారట? ఈ మధ్య అనసూయ, రష్మీ లాంటి వాళ్లతో ఐటెం సాంగ్స్ చేయిస్తే కాస్త ఎక్కువ క్రేజ్ వస్తున్న నేపథ్యంలో మరో హాట్ యాంకర్ ని రంగంలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి .. మరి ఆ హాట్ యాంకర్ ఎవరో తెలుసా .. ఉదయభాను ? ఏంటి షాక్ అవుతున్నారా .. మీరు వింటున్నది నిజమే .. ఈ మద్యే ఇద్దరు పిల్లలకు తల్లయిన ఉదయభాను కొంత గ్యాప్ తరువాత యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఓ డాన్స్ ప్రోగ్రాం కు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈమెతో ఐటెం సాంగ్ చేయించాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట !! ఇప్పటికే ఉదయభాను కూడా రెండు మూడు సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసి అదరగొట్టింది. తాజాగా ఉదయభాను బతుకమ్మ పై చేసిన సాంగ్ బాగా క్రేజ్ రావడంతో ఆమెతో ఈ సాంగ్ చేయిస్తారట !!

  •  
  •  
  •  
  •  

Comments