నిత్యం మద్యంతో స్నానం..1.94 కోట్లు ఖర్చు చేస్తోన్న మోడల్!

Tuesday, January 23rd, 2018, 10:59:36 AM IST

కొంత మంది ప్రవర్తించే తీరు ప్రస్తుత రోజుల్లో చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. కాలం మారిన కొద్దీ మనిషి ఆలోచన కొత్త తరహాలో వెళుతోంది. ఈ ప్రపంచంలో వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని చాలా వెరైటిగా ప్రవర్తిస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. అందరిలో తాను ప్రత్యేకమని నిరూపించుకోవడానికో లేక అదో సారదానో తెలియదు గాని కోటీశ్వరురాలైన ఒక సింగర్ మాత్రం మద్యంతో స్నానం చేస్తుందట.

ఉక్రెయిన్ కి చెందిన నతల్యా షమ్రెన్కోవాది చాలా డిఫెరెంట్ గా ఉండటానికి ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఆమెకు షాంపేన్ లో మునిగి తేలితే చాలా ఇష్టమట. అందుకు ఏడాదికి 1.94 కోట్ల వరకు ఖర్చు పెడుతుందట. అంతే కాకుండా 22 మంది వర్కర్లు ఆమె స్నానానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారట. పాకిస్తాన్ కుటుంబానికి చెందిన బ్రిటీష్ కోటీశ్వరుడు మొహమ్మద్ జహూర్ ను నతల్యా 2003లో వివాహం చేసుకొని అనంతరం కమాలియాగా పేరు మార్చుకుంది. ఇక భర్త కోటీశ్వరుడు అవ్వడంతో డబ్బుకు ఏ మాత్రం లోటు లేదు. ఇష్టం ఉన్నట్టుగా మద్యం కొని అందులో స్నానం చేస్తుందట ఆ బ్యూటీ. ప్రస్తుతం అందుకు సంబందించిన న్యూస్ సోషల్ మీడియాలో లో చాలా వైరల్ మారింది.