ఏకగ్రీవమైన ఏపీ స్పీకర్ పదవి – తమ్మినేని సీతారాంకే ఓటు…

Wednesday, June 12th, 2019, 10:22:00 PM IST

ఏపీలో అసెంబ్లీ స్పీకర్ పదవికి నామినేషన్ వెలువడగా, ఆ పదవికి తమ్మినేని సీతారాం ఒక్కరే నామినేషన్ వేశారు. కాగా ఏపీ కొత్త స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా సీతారాం కి మద్దతుగా ఆయనను బలపరుస్తూ 30 మంది సభ్యులు మద్దతు ఇచ్చారు. కాగా నామినేషన్ల గడువు పూర్తయ్యేసరికి కేవలం ఒకే ఒక్క నామినేషన్ రావడంతో తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా రేపు ఉదయం 11 గంటల సమయంలో తమ్మినేని సీతారాం తన స్పీకర్ పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ… తమ్మినేని సీతారాం స్పీకర్ గా ఉండాలనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కోరిక. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తమ్మినేని సీతారాం ఈ పదవికి అర్హుడని జగన్ నిర్ణయించారు. కాగా ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. అంతేకాకుండా ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు గార్ల ప్రభుత్వంలోని, వారి మంత్రివర్గాల్లో పనిచేసిన అనుభవం ఉండటంతో ఈ స్పీకర్ పదవికి తానె అర్హుడని బొత్స సత్యనారాయణ అన్నారు. కాగా 2004లో టీడీపీ తరఫున, 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2013లో వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈసారి మళ్ళీ అక్కడే పోటీ చేసి గెలుపొందిన తమ్మినేని ఏపీ స్పీకర్ పదవి రావడం హర్షణీయం అని సభ సభ్యులు అన్నారు.