జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్

Thursday, November 14th, 2019, 09:03:10 PM IST

ముఖ్యమంత్రి అయ్యాక జగన్ మోహన్ రెడ్డి పలు విప్లవాత్మక మార్పులు చేస్తున్నారు. అదునులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ని తప్పనిసరి చేస్తూ ఒక జీవో ని తీసుకువచ్చారు ముఖ్యమంత్రి జగన్. అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయం లో తప్పేమి లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. అయితే తెలుగు ని ఒక సబ్జెక్టు గా ఉంచి ఇంగ్లీష్ మాధ్యమం లోనే బోధిస్తే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేసారు. అయితే ఇసుక కొరత పై ఉండవల్లి తన అభిప్రాయాన్ని తెలిపారు. ఇసుక విషయం లో వున్నా గందరగోళానికి ప్రజలకు ఈ సమస్యను అర్థమయ్యేలా వివరించాలని అన్నారు.

అయితే విపక్షాలు చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మంత్రులకు అవినీతి మకిలి అంటుకోలేదని అన్నారు. అయితే ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన అన్యాయంగా జరిగిందని అన్నారు. లోక్ సభలో ఈ అంశాన్ని లేవనెత్తాలని, అందుకే ఈ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. గతంలో చంద్రబాబు కు ఇదే తరహాలో లేఖ రాసినప్పటికీ పట్టించుకోలేదని అన్నారు. ఇపుడు జగన్ కి ఈ బహిరంగ లేఖ రాయడం తో ప్రాధాన్యతని సంతరించుకుంది.