జనసేనానిపై ఉండవల్లి సంచలన కామెంట్స్.!?

Tuesday, September 10th, 2019, 05:00:01 PM IST

జనసేన అనే పార్టీ స్థాపించి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొట్ట మొదటి సారిగా ఎన్నికల బరిలో నిలిచి ఎదురు దెబ్బ తిన్న సంగతి మనం చూసేసాము.కానీ ఇతర రాజకీయ పార్టీల్లా ఆ పార్టీల నాయకుల్లా కాకుండా పవన్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటూ ఎలాంటి డబ్బు,మధ్య ప్రవాహం చెయ్యకుండా ఇరవై లక్షలకు పైగా ఓట్లు సంపాదించుకున్నారు.దీనికంటే పెద్ద విజయం ఇంకేం ఉంటుందని జనసేన అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు.

అయితే ఇలాంటి ఆలోచన వచ్చింది పార్టీ అధినేత అయినటువంటి పవన్ కే కదా.పవన్ పై ఇతర పార్టీల వారు ఎన్నో విమర్శలు చేస్తున్నా సరే పవన్ అంటే ఏమిటో దగ్గర నుంచి చూసిన సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు మాత్రం పవన్ ను తప్పు బట్టలేకపోతున్నారు.కాంగ్రెస్ పార్టీ మాజీ నేత అయినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ పవన్ తో కలిసి గతంలో జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో కీలక పాత్ర పోషించిన సంగతి అందరికి తెలిసిందే.

అయితే గత కొంత కాలం నుంచి సైలెంట్ గా ఉన్న ఆయన తాజాగా పవన్ కొన్ని కామెంట్స్ చేసినట్టుగా జనసేన పార్టీ నేత బొలిశెట్టి సత్యన్నారాయణ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.”మొన్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ గా పోటి చేసి,దురదృష్టవశాత్తూ ఓడిపోయారు, ఆయన పట్టు వదలని వ్యక్తి,అదే పట్టుదల తో ముందుకు వెళ్తే తప్పకుండా విజయం సాధిస్తారు,భవిష్యత్ లో దేశ నాయకుడు అవుతారు” అని ఉండవల్లి తెలిపినట్టుగా ఆయన వ్యక్త పరిచారు.