జగన్ సర్కార్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్..!

Thursday, February 6th, 2020, 04:20:45 PM IST

ఏపీ సీఎం జగన్ సర్కార్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు మీడియాతో మాట్లాడిన ఉండవల్లి మూడు రాజధానుల గురుంచి చెబుతూ దీని గురుంచి నాకు పెద్దగా తెలీదని కానీ దేశంలో ఎక్కడా మూడు రాజధానులు లేవని అన్నారు. అయితే ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడున్నా కావలసింది అభివృద్ధే అని అన్నారు.

అయితే పదేళ్ళలో విశాఖను హైదరాబాద్, బెంగుళూరు తరహాలో డెవలప్ చేస్తానని జగన్ అంటున్నారని అలా కాకుండా డీ సెంట్రలైజ్ చేయాలని అన్నారు. అయితే రాజధాని అంశాన్ని ప్రభుత్వం పక్కన పెట్టి పోలవరం, ప్రత్యేక హోదాపై దృష్టి సారించాలని అన్నారు. అయితే ప్రభుత్వం చెబుతున్నట్టు 2021 జూన్ వరకు పోలవరం పూర్తయ్యేలా లేదని అన్నారు. అంతేకాదు గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటికే పింఛన్లు తీసుకుపోయి ఇవ్వడం అనవసరమని దాని వలన ఆ రోజు పనులు వదిలేసి ప్రజలు ఇంటి దగ్గర కూర్చోవలసి వస్తుందని ఎక్కడో ఒక చోట పెట్టి ఇస్తే ప్రజలు వెళ్ళి తెచ్చుకుంటారని అన్నారు. ఇక పవన్ గురుంచి కూడా మాట్లాడుతూ సినిమాలు మళ్ళీ చేసుకోవడం మంచి నిర్ణయమేనని ఇది నేను ఆయనకు ఏనాడో చెప్పానని అన్నారు.