ఏపీ సీఎం జగన్ పాలనపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు..!

Wednesday, July 17th, 2019, 08:35:43 PM IST

ఏపీలో ఈ ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు ఎన్నికల సమయంలో తాను ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకదాని తరువాత ఒకటి నెరవేరుస్తుండడమే కాకుండా, అవినీతిరహిత పాలనను అందించే దిశగా అడుగులు వేస్తున్నాడు.

అయితే జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన నెలరోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు కురిపించుకుంటున్నాడు. అయితే తాజాగా జగన్ పాలనపై మాజీ ఎంపీ, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే అమెరికాలోని అట్లాంటాలో జరిగిన వైఎస్‌ఆర్‌ జయంతి వేడుకలలో పాల్గొన్న ఉండవల్లి వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా అందించిన సేవలను గురించి మరొక సారి గుర్తు చేసుకున్నాడు. అయితే తాను ఒక వంద రోజుల పాటు ఏపీ రాజకీయల గురుంచి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నానని కానీ ప్రస్తుతం ఏపీలో జగన్ పాలన గురుంచి మాట్లాడకుండా ఉండలేకపోతున్నానని అన్నాడు. అయితే మంచి పాలనతో పాటు తన తండ్రి వైఎస్ పాలనను మరిపించే పాలనను ప్రజలకు అందించాలని అదే జగన్ నుంచి ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అయితే ప్రస్తుతం జగన్ ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగు అచీ తూచీ వేయాలని ఈ ఐదేళ్ళ్లో రాజన్న పాలనను మరిపించే పాలనను జగన్ అందిస్తాడని అనుకుంటున్నానని జగన్ సంకల్పానికి ప్రతి ఒక్క కార్యకర్త తోడుగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు