సీఎం జగన్ కి ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ…ఏమన్నారంటే!

Friday, July 31st, 2020, 02:10:04 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అయితే కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి సకాలం లో వైద్యం అందక మరణిస్తున్న వారిని మనం చూస్తున్నాం. అయితే ఈ నేపధ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కి మాజీ ఎంపీ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక లేఖ రాశారు. అందులో కరోనా రోగులకు చికిత్స పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రోగుల కోసంతాత్కాలిక కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఫంక్షన్ హాళ్లు స్వాధీనం చేసుకొని, ఎన్ జీఓ, ట్రస్ట్ లకు అప్పగిస్తే ఉపయోగం ఉంటుంది అని భావించారు. అయితే వాటి నిర్వహణ కోసం అయ్యే కర్చు ను ఎన్జీవో లు, ట్రస్టు లే భారీస్థాయి అని, కాకపోతే ప్రభుత్వం డాక్టర్ లను, నర్సింగ్ సిబ్బంది ను అందించాలని సూచించారు.

అయితే ఈ లేఖ లో ఒక కీలక విషయం ను వివరించారు. రాజమండ్రి లో ఇప్పటికే ఒక జైన్ సంఘం కళ్యాణ మంటపం ను అద్దెకు తీసుకుని కరోనా కేంద్రం గా నడుపుతోంది అని వ్యాఖ్యానించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా కరోనా పరీక్షలకు అయ్యే ఫీజ్ ప్రభుత్వమే నిర్ణయించాలి అని కోరారు. అందుకు గల కారణం ను వివరించారు. పేద, మద్య తరగతి ప్రజలు డబ్బు లేదా పలుకు బడి ఉంటేనే కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని బయటపడలెం అని, వారు అవేదన చెందుతున్న విషయాన్ని లేఖ లో స్పష్టంగా వివరించారు.అంతేకాక కరోనా పై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరు లో సీఎం జగన్ కి బలాన్ని ఇవ్వాలి అని ప్రార్థిస్తున్నా అని అన్నారు.