నిరుద్యోగ సమస్య వెంటాడిన మోదీ మళ్ళీ ఎలా నెగ్గుకొచ్చారు..!

Thursday, June 6th, 2019, 12:40:46 AM IST

దేశంలో 2014 ఎన్నికలలో ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు వేరు. మారిపోతున్న రాజకీయాలను బట్టి చూస్తుంటే అసలు ఈ సారి దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందేమో అన్న సందేహాలు అందరిలో ఏర్పడ్దాయి. 2014 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన బీజేపీ, ఈ సారి కూడా అదే మెజారిటీతో విజయం సాధించింది. అయితే ఈ సరి జరిగిన ఎన్నికలలో ప్రభుత్వంపై కాస్త వ్యతిరేకత ప్రజలలో కనిపించడం, స్థానిక పార్టీలు ఏకమవ్వడం చూసి ఒకానొక సమయంలో మోదీ కూడా భయపడ్దారంటే పోటీ ఎంతలా ఉండిందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.

అయితే దేశంలో నిరుద్యోగ సమస్య ప్రస్తుతం ప్రధాన సమస్యగా మరింది. న్స్సొ సంస్థ వారు నిర్వహించిన సర్వేలో దేశంలో నిరుద్యోగ సమస్య 2017-18 లో మరింత పెరిగిపోయిందని చెప్పింది. అయితే ఈ ఒక్క సమస్యనే బీజేపీనీ అప్పట్లో బాగా ఇబ్బంది పెట్టింది. అయితే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా దీనిని పెద్దగా పట్టించుకోకపోవడం, దీనిని ప్రజలలోకి తీసుకెళ్ళి బలంగా తమ వాదనను వినిపించడంలో కాంగ్రెస్ విఫలమైంది. అయితే మోదీ దీనికి రెడీగా ఒక ప్లాన్‌ను కూడా సిద్దం చేసుకున్నారు. అయితే అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించి విద్య, ఉద్యోగాల్లో వారికి కూడా రిజర్వేషన్లు పెట్టి అవకాశాలను కల్పిస్తామని ప్రకటించారు. అప్పటి వరకు కాస్త వ్యతిరేకత ఉన్న నిరుద్యోగులలో కూడా మోదీ ఈ హామీ ఇవ్వడంతో చల వరకు అగ్రవర్ణ కులాలకు సంబంధించిన యువత మరొకసారి మోదీకే పట్టం కట్టారని అర్ధమవుతుంది. ఇలా అన్ని రకాల వారిని మేనేజ్ చేస్తూ ఏ పార్టీ మద్ధతు లేకుండా మరోసారి అధికారంలోకి వచ్చారు ప్రధాని మోదీ.