బిగ్ బ్రేకింగ్ : వైసీపీలోకి చేరనున్న ఊహించని నేత..ఇక జగన్ కు తిరుగు లేనట్టే

Sunday, June 2nd, 2019, 10:13:00 PM IST

ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తనకున్న బలం ఏ స్థాయిలో ఉందో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిరూపితం అయ్యింది.ఇప్పుడు జగన్ కు ఆ బలాన్ని మరింత ఎక్కువ చేసే సూచనలు రానున్న రోజుల్లో కనబడుతున్నాయా అంటే దానికి అవుననే సమాధానమే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారుతుంది.యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పుడు ఒక పెద్ద తల చేరబోతోంది అన్న వార్తలు ఊపందుకున్నాయి.అతను మరెవ్వరో కాదు సాక్ష్యాత్తు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మగా చెప్పబడే కేవీపీ రామ చంద్రారావు.

ఈయన అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి మరియు దివంగత వైఎస్సార్ దగ్గర ఎలాంటి పాత్ర పోషించారో అందరికీ తెలిసిందే.కానీ వై ఎస్ మరణాంతరం ఆయన పార్టీ పరంగా జగన్ కు దూరంగా ఉన్నా సరే కుటుంబ పరంగా మాత్రం జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నారనే టాక్ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది.కానీ ఇప్పుడు మాత్రం ఈయన అధికారికంగా వైసీపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ రోజు కూడా చాలా దగ్గరలోనే ఉందన్న వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది.గతంలో వైఎస్సార్ పక్కన ఈయన ఉన్నపుడు ఈయన సలహాలు వైఎస్ తీసుకునే వారు.అలాంటి వ్యక్తి ఇప్పుడు జగన్ దగ్గరకు చేరుతున్నారు అంటే ఇక జగన్ కు అదనపు బలం పెరిగినట్టే అని చెప్పాలి.దీనితో ఇక రానున్న రోజుల్లో జగన్ కు తిరుగు ఉండదని ఈ విషయం తెలిసిన వైసీపీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.