ఆస్కార్ వేడుకల్లో ఎప్పటికీ మర్చిపోలేని పొరపాటు !

Monday, February 27th, 2017, 10:20:32 PM IST


ఆస్కార్ వేడుకలు మొదలయ్యాయంటే పాటు యావత్ సినీ ప్రపంచం చూపు దాని మీదే ఉంటుంది. ప్రపంచంలోనే సినీ రంగానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డులను ఒక్కసారైనా అందుకోవాలని నటీనటులు, సాంకేతిక నిపుణులు నుండి సినీ కళా రంగానికి చెందిన ప్రతి ఒక్కరు ఆశపడుతుంటారు. తాజాగా 89వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజిల్స్ లో అట్టహాసంగా జరిగింది. ప్రపంచ నలుమూలల నుండి ప్రముఖులు హాజరయ్యారు.

ఇక వివిధ క్యాటగిరీల్లో నామినేషట్ అయిన సభ్యుల ఉత్కంఠ అయితే చెప్పనక్కర్లేదు. అవార్డు తమకొస్తుందా రాదా అనే టెంక్షన్లో ఒక్కొక్కరి నరాలు తెగిపోతున్న సమయమది. అలాంటి సమయంలోనే ఆస్కార్ నిర్వాహకులు చేయకూడని, ఎప్పటికీ మర్చిపోలేని పొరపాటు చేశారు. అదేమిటంటే ఉత్తమ చిత్రం క్యాటగిరీలో ప్రెజెంటర్ వారెన్ బియట్టీ ముందుగా మ్యూజికల్ హిట్ ‘లా లా ల్యాండ్’ పేరు ప్రకటించాడు.

దీంతో ఆ చిత్ర టీమ్ సగర్వంగా స్టేజి మీదకు వచ్చి అవార్డు అందుకోడానికి రెడీ అయ్యారు ఇంతలోనే పొరపాటు తెలుసుకున్న ప్రెజెంటర్ ఉత్తమ్ చిత్రం అవార్డు ‘లా లా ల్యాండ్’ కు రాలేదని ‘మూన్ లైట్ టీమ్’ చిత్రానికి వచ్చిందని, పొరపాటున ‘లా లా ల్యాండ్’ పేరు ప్రకటించామని చల్లగా చెప్పారు. దీంతో హపీటికే స్టేజీ మీదకొచ్చిన ‘లా లా ల్యాండ్’ టీమ్ కు తీవ్ర నిరాశ ఎదురైంది. సభలో అంతా పొరపాటున వారికి జరిగిన అవమానానికి జాలిగా వారి వైపు చూశారు. ఇక లా లా ల్యాండ్ టీమ్ పరిస్థితైతే అవార్డు రాకపోగా అనవసరపు జాలిని పొందవలసినట్టయింది.