పోలవరంలో అవినీతికి ఆధారాల్లేవు.. తేల్చి చెప్పిన కేంద్ర జలశక్తి..

Sunday, June 28th, 2020, 02:10:53 AM IST


ఏపీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్ట్‌లో గత టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని వైసీపీ ఆరోపణలు చేస్తూ వస్తుంది. అయితే తాజాగా పోలవరం ప్రాజెక్టు అవినీతిపై ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది.

అయితే ప్రధాని పోలవరంపై విచారణ జరపమని తమకు ఎక్కడా ఆదేశాలివ్వలేదని తెలిపింది. eapee ప్రభుత్వం వేసిన విచారణ కమిటీ నివేదికను వాళ్లే పక్కన పెట్టినట్లు కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. నిబంధనలకు అనుగుణంగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతోందని అదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని జలశక్తి శాఖ ప్రకటించింది. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటనతో ఏపీలో గతంలో అధికారంలో ఉన్న టీడీపీకి ఊరట లభించినట్టయ్యిందనే వాదనలు వినిపిస్తున్నాయి.