జగన్ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేసిన కిషన్ రెడ్డి

Wednesday, November 13th, 2019, 04:21:44 PM IST

జగన్ ప్రభుత్వ వైఖరి పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే వైసీపీ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం మంచిది కాదని అన్నారు. బీజేపీ కార్యకర్తల పై వైసీపీ పార్టీ కక్ష్సాధింపు చర్యలు చేస్తుందని ఫిర్యాదులు అందాయి అని తెలిపారు. ఇలాంటి కక్ష సాధింపు ధోరణి సరైనది కాదని అన్నారు. అన్యమత ప్రచారం,బలవంతపు మత మార్పిడిలు మంచిది కాదని అన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్తుతులపై కిషన్ రెడ్డి స్పందించారు.

జగన్ వెంకయ్య నాయుడు పై చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావిస్తూ, వెంకయ్య నాయుడు పై జగన్ వ్యాఖ్యలు సరికావని, ఎక్కడైనా మాతృభాషని కాపాడుకోవాలి అని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. అయితే బుధవారం నాడు విశాఖ బీచ్ లో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం లో పాల్గొన్న కిషన్ రెడ్డి, ప్లాస్టిక్ వ్యర్దాలను తొలగించారు, ప్రజలందరూ స్వచ్ఛ భారత్ ఉద్యమం లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.