హీరో శ్రీ‌కాంత్ ఇంట్లో అప‌రిచితుడి విధ్వంశం

Saturday, September 23rd, 2017, 12:00:48 PM IST

శ‌తాధిక చిత్రాల క‌థానాయ‌కుడు శ్రీ‌కాంత్ ఇంటిపై ఓ అప‌రిచితుడు ఎటాక్‌కి దిగ‌డం ఫిలింన‌గ‌ర్‌లో సంచ‌ల‌న‌మైంది. స‌ద‌రు దుండ‌గుడు భీభ‌త్సం సృష్టించి రెండు కార్లు ధ్వంశం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. నేటి మ‌ధ్యాహ్నం ఇంట్లో జొర‌బ‌డిని అప‌రిచితుడు విధ్వంసం సృష్టించాడ‌ని చెబుతున్నారు.

జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 76 లో హీరో శ్రీకాంత్ భార్య ఊహ స‌హా కుమార్తె మేధ‌, కుమారుడు హీరో రోష‌న్ తో క‌లిసి నివాసం ఉంటున్నారు. దుండ‌గుడి భీభ‌త్సంపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో హీరో శ్రీకాంత్ ఫిర్యాదు చేశార‌ని తెలుస్తోంది. అయితే ఈ గ‌డ‌బిడ ఎందుకు జ‌రిగింది? అన్న‌ది తెలియాల్సి ఉందింకా. దొంగ‌త‌నం కాదు.. కేవ‌లం ఘ‌ర్ష‌ణ మాత్ర‌మే కాబ‌ట్టి ఏవైనా ఆర్థిక లావాదేవీలే కార‌ణ‌మా? అన్న‌ది తెలియాల్సి ఉందింకా.

  •  
  •  
  •  
  •  

Comments