టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. రక్షణ ఏదీ?

Monday, April 12th, 2021, 11:10:01 PM IST


తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి చేదు అనుభవం ఎదురయ్యింది. తిరుపతి గాంధీ రోడ్డులో చంద్రబాబు ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కొందరు చంద్రబాబు కాన్వాయ్‌పైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు యువకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై తీవ్రంగా మండిపడ్డ చంద్రబాబు నాయుడు క్రిష్టాపురం పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆందోళనకు దిగారు. సీఎం జగన్ డౌన్‌డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేస్తున్నారు.

అయితే ఇది ముమ్మాటికి పిరికిపంద చర్య అని పోలీసుల వైఫల్యమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న తనకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితేంటని చంద్రబాబు ప్రశ్నించారు. నిరసన వద్దని చంద్రబాబును పోలీసులు కోరగా ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని పోలీసులను చంద్రబాబు నిలదీశారు. తనకు రక్షణ లేకపోతే ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు.