అన్‌లాక్ 2.0పై కేంద్రం ప్రకటించిన కీలక మార్గదర్శకాలు ఇవే..!

Monday, June 29th, 2020, 11:40:07 PM IST

దేశవ్యాప్తంగా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. అన్‌లాక్ 2.0కు సంబంధించి కొన్ని కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.

అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా జూలై 31 వరకూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ అమల్లోనే ఉంటుందని స్పష్టం చేసింది. అయితే జూలై 31 వరకూ కంటైన్మెంట్ జోన్లలో పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమలవుతుందని, స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, విద్యా సంస్థలు, అంతర్జాతీయ విమాన సేవలు, మెట్రో రైళ్ల సేవలు, సినిమా థియేటర్లు, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, ప్రార్థనా మందిరాలకు జూలై 31 వరకూ అనుమతి లేదని తేల్చి చెప్పింది.