త్వరలో విడుదల కాబోతున్న సిల్క్ స్మిత విడుదల కానీ కొత్త సినిమా..!

Sunday, September 16th, 2018, 08:00:36 PM IST

1980 మరియు1990 మధ్య కాలంలో తన అంద చందాలతో అప్పటి కుర్రకారుని ఉర్రూతలూ ఊపిన నటి మరియు నృత్య కళాకారిణి ఐన సిల్క్ స్మిత యొక్క కొత్త చిత్రం విడుదల కాబోతుంది. అదేంటి ఆవిడ మరణించి ఎన్నో ఏళ్ళు అవుతుంది కదా..? మళ్ళీ కొత్తగా సినిమా విడుదల కావడం ఏంటి అనుకుంటున్నారా..?ఆవిడ 1996 వ సంవత్సరంలో కొన్ని అనివార్య కారణాల వల్ల మరణించిన సంగతి తెలిసినదే.

అయితే ఆవిడ చనిపోయే ఒక్క సంవత్సరం ముందు అంటే 1995 వ సంవత్సరంలో ఆవిడ “రాగ తలంగళ్” అనే చిత్రంలో నటించారు.ఐతే అప్పుడు ఆ చిత్రం కొన్ని కుల వివాదాల కారణంగా విడుదలకి నోచుకోలేదు. దానితో అప్పుడు ఆ సినిమా విడుదల ఆగిపోయింది.ప్రస్తుతం అందుతున్న కథనాల ప్రకారం ఆ చిత్రానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విషయం గడిచి దాదాపు 23 ఏళ్ళు గడుస్తుంది.ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ మనం వెండితెర మీద సిల్క్ స్మితని చూడబోతున్నాం.

  •  
  •  
  •  
  •  

Comments