“పసుపు కుంకుమ”కు సంబంధించి బయటకొస్తున్న టీడీపీ అవినీతి చిట్టా!

Friday, July 19th, 2019, 03:20:24 PM IST

గత ఎన్నికలకు సరిగ్గా ముందు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వద్దామని వేసిన ఎత్తుల్లో “పసుపు కుంకుమ” ఒకటి.పెద్ద మొత్తంలో మహళలను టార్గెట్ చేసి చంద్రబాబు వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది.అయితే దీని వెనుక తెలుగు తమ్ముళ్ల చేతివాటం గట్టిగానే ఉందని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తాజాగా ఒక చర్చ నడుస్తుంది.అప్పుడు అర్హులైన మహిళల ఖాతాల్లోకి విడతల వారీగా డబ్బులు జమ చేసే కార్యక్రమంలో కింద స్థాయి పసుపు దళం గట్టిగానే ప్లాన్ చేశారట.

ఆయా ప్రాంతాల వారీగా అర్హులైన మహిళల జాబితాలు మాత్రమే కాకుండా అదనంగా వీరి చేతి వాటం చూపి చాలా వరకు నకిలీ అకౌంటులు తయారు చేసి న్యాయపరంగా అర్హులైన మహిళల ఖాతాల్లోకి చేరాల్సిన సొమ్ములను వీరి ఖాతాల్లోకి తరలించినట్టు వార్తలు వస్తున్నాయి.దీనిపై దుర్గాబాయి మహిళా సంఘం వారు ఫిర్యాదు చెయ్యడంతో ఈ తతంగం అంతా బయటకు వచ్చింది,అలాగే దీనిపై ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం చర్యలు కూడా మొదలు పెట్టిందని తెలుస్తుంది.మొత్తానికి బాబు కింద ఉన్నవాళ్లు బాగానే టోపీ పెట్టారుగా.