హమ్మయ్య .. పద్మావతికి అక్కడ లైన్ క్లియర్ ?

Sunday, January 14th, 2018, 12:55:12 AM IST

పద్మావతి .. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సినిమా. సంజయ్ లీల బన్సాలి దర్శకత్వంలో దీపికా పదుకునే నటించిన ఈ సినిమా విడుదల విషయంలో రేగుతున్న దుమారం అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఈ సినిమాను కొన్ని రాష్ట్రాలు నిషేధించాయి కూడా. తాజాగా సెన్సార్ వాళ్ళు కొన్ని కట్స్ చెప్పడం దానికి దర్శకుడు ఓకే అనడంతో సినిమా విడుదలకు మార్గం సుగమం అయింది. వచ్చే నెల 9న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యూపీ లో విడుదల చేయొద్దంటూ ముఖ్యమంత్రి ఆదిత్య నాథ్ అడ్డు చెప్పిన విషయం తెలిసిందే .. తాజాగా అయన ఈ సినిమాను యూపీ లో విడుదల చేసుకోవచ్చని తెలిపాడు. దాంతో ప్రభుత్వం ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. సో పద్మావతి సినిమాకు ఒక్కో మార్గం ఓపెన్ అవుతుందన్నమాట. మరో వైపు ఈ చిత్రాన్ని చూడడానికి అటు జనాలు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు.