ఆస్ట్రేలియాలో జనవరి 27న రెండు లక్షల మందికి జ్వరాలు రాబోతున్నాయి….?

Monday, January 23rd, 2017, 12:30:59 PM IST

ff
జనవరి 26 ఇండియాకి గణతంత్ర దినోత్సవం. ఆస్ట్రేలియాకి మాత్రం ఆ రోజు జాతీయ పండుగ. జనవరి 26న ఆస్ట్రేలియాలో పబ్లిక్ హాలిడే ప్రకటించారు. ఆ తరువాత రోజు శుక్రవారం ఒక రోజు డ్యూటీ చేస్తే శని, ఆదివారాలు సెలవు. ఈ నేపథ్యంలో అక్కడ చాలామంది ఉద్యోగులు శుక్రవారం సెలవు పెడితే వరుసగా నాలుగు రోజులు సెలవులు ఎంజాయ్ చేయొచ్చని దాదాపు రెండు లక్షల మంది ఒకేసారి సిక్ లీవ్ పెట్టడానికి సిద్దమౌతున్నారని తమ దగ్గర సమాచారం ఉందని ఆస్ట్రేలియా ఛాంబర్ అఫ్ కామర్స్ అఫ్ ఇండస్ట్రీ చీఫ్ జేమ్స్ పర్సన్ పేర్కొన్నారు.

వర్కింగ్ డే రోజు ఒకేసారి అంతమంది సెలవు పెడితే దేశవ్యాప్తంగా వ్యాపారాల్లో 62 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 422 కోట్లు) నష్టం వస్తుందని తెలిపారు. దీంతో ఆ రోజు ఎంతమంది జ్వరాలు, దగ్గులు, తుమ్ములు అని ఫోన్ చేస్తారోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఆస్ట్రేలియా గణాంక శాఖ వివరాల ప్రకారం అక్కడ సగటు ఉద్యోగి సంవత్సరంలో సుమారు ఎనిమిది నుండి తొమ్మిది రోజులు సిక్ లీవ్ లు పెడతారని అంటున్నారు.