ఉపాసన మొదలు పెట్టిన కేఫ్.. చిరు ఫిల్టర్ కాఫీ స్పెషల్

Friday, December 1st, 2017, 04:23:07 PM IST

సోషల్ మీడియాలో చాలా స్పీడ్ గా ఉండే రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఏ చిన్న విషయాన్ని అయినా సరే మెగా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. మోగా కోడలిగానే కాకుండా మంచి బిజినెస్ వుమెన్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఉపాసన రీసెంట్ గా అపోలో ఫౌండేషన్ తరపున ఒక మంచి కాఫీ షాప్ ను ప్రారంభించారు. జూబ్లీహిల్స్ లోని అపోలో ఎఫ్ఎన్డీ థియేటర్ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. ఇక ట్విట్టర్ లో ఫొటోని పోస్ట్ చేస్తూ కేఫ్ కు వచ్చి రిలాక్స్ అవ్వండి అని ఉపాసన ట్వీట్ చేశారు. ఈ కేఫ్ లో కొన్ని స్పెషల్ ఐటెమ్స్ గురించి ఉపాసన క్లారిటీ ఇచ్చారు. చిరు ఫిల్టర్ కాఫీ ఇందులో స్పెషల్, అంతే కాకుండా వరల్డ్ ఫేమస్ సమోసా, మిర్చి బజ్జీలు, హైదరాబాదీ కేసర్ రోజ్ టీ, లుక్మి చికెన్/వెజ్ లభిస్తాయని తెలిపారు

  •  
  •  
  •  
  •  

Comments