పిక్ టాక్‌ : షాకిస్తున్న‌ మెగా న్యూ హీరోయిన్‌?

Tuesday, February 13th, 2018, 10:55:00 PM IST

మెగా ఫ్యామిలీ నుంచి నాగ‌బాబు త‌న‌య నీహారిక టాలీవుడ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నీహారిక కాకుండా ఇంకెవ‌రైనా హీరోయిన్ ఉన్నారా? అంటే ఉన్నార‌నే సందేహం క‌ల‌గ‌క మాన‌దు. ఇదిగో ఇక్క‌డున్న ఫోటో చూశాక‌.. ఆ మాట మీరే చెబుతారు.

స్టార్ హీరో రామ్‌చ‌ర‌ణ్ భార్యామ‌ణి .. అపోలో వైస్ ప్రెసిడెంట్ ఉపాస‌న కొత్త రూపం ప్ర‌స్తుతం షాకిస్తోంది. ఇంత‌లోనే ఎంత మార్పు? ఇదెలా సాధ్యం? అంటూ యూత్ ప‌రేషాన్ అయిపోతున్నారంటే న‌మ్మండి. ఉపాస‌న కామినేని ఫిట్‌నెస్ ఫ్రీక్ అన్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే త‌న బ‌రువు త‌గ్గించుకునేందుకు తాను ఎంచుకున్న మార్గం స్ట‌న్నింగ్ అనే చెప్పాలి. కేవ‌లం వారంలోనే మార్పు క‌నిపించే ర‌క‌ర‌కాల టిప్స్‌ని ఉపాస‌న అనుస‌రించారు. ఆ క్ర‌మంలోనే త‌న‌కు ఈ కొత్త రూపం వ‌చ్చింది. అయితే ఇదంతా క‌ఠోరంగా శ్ర‌మిస్తేనే ద‌క్కిన‌ది. పైగా నోరు క‌ట్టేసుకుని ఆకుకూర‌లు, కాయ‌గూర‌ల్లో కొన్నిటికి మాత్ర‌మే అంకిత‌మై, ఇలా ఈ రూపాన్ని తేగ‌లిగారు. క్లీన్ వీక్ పేరుతో వారం రోజులు కేవ‌లం ఆకుకూరలు.. బఠానీలు.. దోసకాయలు.. క్యారెట్లు.. ప‌చ్చి కూర‌గాయ‌లు మాత్రమే తిని ఉన్నారుట‌. తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన ఫోటో చూస్తే షాక‌వ్వ‌కుండా ఉండ‌లేరెవ‌రూ.. ధృవ సినిమా కోసం చ‌ర‌ణ్ అయినా ఇంత క‌ష్ట‌ప‌డి ఉండ‌డేమో?