సైరా షూట్‌.. మామ‌పై కోడ‌లు అప్‌డేట్‌

Wednesday, December 6th, 2017, 12:21:44 PM IST

మెగాస్టార్ క‌థానాయ‌కుడిగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శక‌త్వంలో `సైరా` రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ మొద‌లైంది. మెగాస్టార్ చిరంజీవిపై తొలిరోజు హైద‌రాబాద్‌ అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో మొద‌టి షాట్‌ చిత్రీక‌రించారు. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ వేసిన ప్రత్యేకమైన సెట్లో చిత్రీక‌ర‌ణ మొద‌లైంది. మామ‌గారు సెట్స్‌కి వెళ్లిన విష‌యాన్ని కోడ‌లు ఉపాస‌న ఎంతో సంబ‌రంగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఆ మేర‌కు ట్విట్ట‌ర్‌లో వివ‌రాలందించారు.

“కొణిదెల ఫ్యామిలీకి,.. మిస్ట‌ర్ సికి.. న్యూ బిగినింగ్ ఇది. రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్న రెండో చిత్ర‌మిది. మామ మెగాస్టార్ న‌టిస్తున్న 151వ సినిమా కూడాను. సైరా – న‌ర‌సింహారెడ్డి .. ది ప‌వ‌ర్ ఆఫ్ ది క్యారెక్ట‌ర్స్‌.. టీమ్ ఎంతో ఉత్సాహంగా ముందుకెళుతోంది“ అంటూ ఉపాస‌న ట్వీట్ చేశారు. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను చిరుతనయుడు రామ్‌చ‌రణ్ స్వయంగా నిర్మిస్తున్నారు. తొలి తెలుగు స్వాతంత్య్ర‌ సమరయోధుడు `ఉయ్యాలవాడ నరసింహారెడ్డి` జీవిత క‌థ‌ ఆధారంగా రూపొందుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments