మగధీరుడి ఒడిలో ఎంత ఠీవీగా కూర్చుంది

Saturday, October 14th, 2017, 04:00:13 PM IST

రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో బాగా చురుకుగా ఉంటారు. చెర్రీ విశేషాల్ని ఆమె ట్విట్టర్ వేదికగా పంచుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. తాజగా మరో అందమైన ఫోటోని ఆమె పోస్ట్ చేసారు. రామ్ చరణ్ సోఫాలో కూర్చుని ఉండగా అతడి ఒడిలో ప్రేమగా పెంచుకునే శునకం ఠీవీగా కూర్చుని ఉంది. లవ్ ఆఫ్ మై లైఫ్ అనే హ్యాష్ టాగ్ తో ఉపాసన ఈ ఫోటోని షేర్ చేసారు.

ఇదిలా ఉండగా రామ్ చరణ్ ప్రస్తుతం రంగస్థలం చిత్రం లో నటిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలోని ఈ సినిమా విడుదల తేదీ విషయంలో సందిగ్థత నెలకొని ఉంది. మొదట ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని భావించినా ఆ తరువాత అది మారినట్లు తెలుస్తోంది.